ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 30, తెల్లవారుజామున బంధనకల్ గ్రామం బస్ స్టేజి సమీపంలో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నకారు. ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామ సమీపంలో ఓకారు టీఎస్ 22జి 2166 గలది స్తంభాన్ని ఢీ కొట్టిన ఘటనకారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపిన సమాచారం. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన వాసులుగా గుర్తింపు ఆకారులో దుర్గయ్య , అశోక్, మోసి, శ్రీమన్ లు ఉన్నారు. వీరి నలుగురిలో దుర్గయ్యనే వ్యక్తికి చెవులద్వారా రక్తస్రావం కావడంతో స్థానికులు180 వాహనంకు ఫోన్ చేయగా వెంటనే స్పందించిన 108 వాహన సహాయంతో హుటాహుటిన సిద్దిపేట్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. సిద్దిపేట్ నుండి ముస్తాబాద్ వైపు వెళ్తున్న క్రమంలో ఈప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం ఘటనాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది




