హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా తెలంగాణ యువశక్తిని మేలుకొలిపే దిశగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటేషన్ గురించి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి అధ్యక్షతన ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అసెంబ్లీ ఇన్చార్జ్ జనరల్ సెక్రెటరీ ప్రమోద్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ కు అనుకున్నంత యువత నుండి స్పందన రాకపోవడం, సభ్యత్వ నమోదు కాకపోవడం వల్ల జులై 1 తేదీ వరకు పొడగింపు ఉంటుందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్కు యువత నుండి పదివేల ఆన్లైన్ సభ్యత్వం నమోదు కావాలని తేదీని పొడగింపు జరిగిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల నుండి వడ్ల కొనుగోలు చేశాక వారి అకౌంట్లో అమౌంట్ వేయలేక రైతులను ఇబ్బందికి గురి చేస్తుందని , చాలామంది రైతుల దగ్గర వడ్లను కొనుగోలు చేయక రైతులు పండించిన వడ్లు కళ్లెంలోనే ఉంటున్నాయని పేర్కొన్నారు, రైతు సమస్యలపై రేపటినుండి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కార్యక్రమాలు చేస్తాయని ఈ సందర్భంగా చెప్పారు .నకిలీ విత్తనాల గురించి బ్లాక్ లో నకిలీ విత్తనాలు అమ్మడం వల్ల రైతులు చాలా ఇబ్బందికి గురవుతున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యఅతిథి అసెంబ్లీ ఇన్చార్జ్ జనరల్ సెక్రెటరీ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ యూత్ డిక్లరేషన్ క్విజ్ పోటీలను ఆన్లైన్లో భారీగా తెలంగాణ రాష్ట్ర యువత పాల్గొనాలని మంచి సంకల్పంతో రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఈ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య చాలా పెరిగిపోయిందని 2014 ముందు చూసుకుంటే ఇప్పుడు ఉన్న దానితో పోల్చుకుంటే భారీగా నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం మరిచిపోవడం చాలా దురదృష్టకరమని , వారి కుటుంబాలకు నెలకు 25వేల రూపాయల మరియు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి నెలకు 4000 రూపాయలు కల్పించాలని తెరాస ప్రభుత్వం పై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమాలు చేసిన కార్యకర్తలపై కేసులు మాఫీ చేయాలని ఫీజు రీయింబర్స్మెంట్ ని ఉన్నత విద్యను యువతకు అందించాలని కోరారు. రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటేషన్ 60 ప్రశ్నలు 60 నిమిషాల వ్యవధి తెలంగాణ రాష్ట్రంలోని భారీగా యువత సభ్యత్వ నమోదు చేసుకోవాలని ఈ క్విజ్ కాంపిటేషన్ కి మొదటి బహుమతిగా లాప్టాప్, రెండవ బహుమతిగా స్మార్ట్ ఫోన్, మూడవ బహుమతిగా టాబ్లెట్ మరియు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లోని మహిళా టాపర్లకు ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రోత్సాహక బహుమతులు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి ,సిద్దిపేట జిల్లా యూత్ అధ్యక్షురాలు తూముకుంట ఆంక్ష రెడ్డి, సిద్దిపేట జిల్లా వైస్ ప్రెసిడెంట్ వహిద్ ఖాన్, గజ్వేల్ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, వర్గల్ మండల్ అధ్యక్షుడు సందీప్ రెడ్డి, జగదేవపూర్ మండల్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, తూప్రాన్ మండల అధ్యక్షుడు భాస్కర రెడ్డి, ములుగు మండల్ అధ్యక్షుడు శ్రీనివాస్ సెట్, కుకునూరుపల్లి మండల అధ్యక్షుడు మెదిన్పూర్ శ్రీనివాస్ రెడ్డి, గజ్వేల్ టౌన్ అధ్యక్షుడు మునగారి రాజు, జనరల్ సెక్రటరీ నక్క రాములు గౌడ్, వివిధ మండల అధ్యక్షులు, సెక్రటరీలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.




