Breaking News ప్రాంతీయం

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన దివ్యాంగులు..

111 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 10, తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో వికలాంగుల ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిన్నటి రోజున దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసిఆర్  గతంలోనే ప్రవేశపెట్టిన పెన్షన్ 3016 ఉండగా అదనంగా 1000 రూపాయలు కలుపుకొని 4016 దివ్యాంగులకు పెంచిన సందర్భంగా  మండేపల్లి గ్రామంలో ఉదయం 9:30 నిముషాలకు ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటిఆర్ చిత్రపటాలకు దివ్యాంగులు గోడిసేలా రామకిష్టయ్య, గాదగోని మొండయ్య, పెద్ది శంకరయ్య, శ్రీనివాస్, మసూరి కుంటయ్య, బండి సత్తయ్య, క్షీరాభిషేకం చేశారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న – లింగం, ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్, గ్రామశాఖ అధ్యక్షులు నక్క రవి, బి ఆర్ ఎస్ నాయకులు బుస్స లింగం, అసాని ప్రతాప్ రెడ్డి, గుర్రం కిషన్ గౌడ్, రాగిపెల్లి కిష్టారెడ్డి, కడారి శ్రీను, లింగంపెల్లి రాజు, పెద్ది రాజు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *