ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డిజూన్ 3 శనివారం మండల కేంద్రంలో తెలంగాణ తల్లి సమీపంనుండి రైతులు ప్రజాప్రతినిధులు ట్రాక్టర్ల ద్వారా మామిడి తోరణాలతో ర్యాలీగావెళ్లి రైతువేదికలో సమావేశమయ్యారు. ఈసందర్భంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ఉన్నటువంటి రైతు వేదికలలో కేంద్రంగా చేసుకొని వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జరుగునని ముఖ్యంగా ముస్తాబాద్ మండల రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అభివృద్ధి బాట దిశగా వెళ్తున్న తరుణంలో ఉచిత కరంటు, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాల విశిష్టతను ప్రస్తావన చేస్తూ ఈనెల 22 వరకు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు కొనసాగిస్తామన్నారు తద్వారా 4న.సురక్ష దివస్,5న.తెలంగాణ విజయోత్సవం,6న. పారిశ్రామిక ప్రగతి ఉత్సవం,7న.సాగునీటి దినోత్సవం,8న ఊరూర చెరువు పండుగ,9న. తెలంగాణ సంక్షేమ సంబరాలు,10న.సుపరిపాలన దినోత్సవం,11న.సాహిత్య దినోత్సవం,12న. తెలంగాణ రన్,13న.మహిళా సంక్షేమ దినోత్సవం, 14న.ఆరోగ్య దినోత్సవం,15న.పల్లె ప్రగతి దినోత్సవం,16న.పట్టణప్రగతి దినోత్సవం,17న. గిరిజన దినోత్సవం,18న.విద్యా దినోత్సవం,19న.హరితోత్సవం,20న.విద్యా దినోత్సవం,21న.ఆధ్యాత్మిక దినోత్సవం,22న. అమరుల సంస్మరణ రాష్ట్రమంతటా కూడా ఈనెల 22 వరకు ప్రజలకు నైతిక విలువల గురించి తెలియజేయాలని ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులందరితో కలిసి సామూహిక సహపంక్తి భోజనాలు చేశారు. ఈకార్యక్రమంలో ముస్తాబాద్ మండల బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మహిళానాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
