Breaking News

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

310 Views

 

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన బొగ్గుల నవీన్ (విద్యార్థి) ఈ మధ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తలలో రక్తం గడ్డ కట్టడంతో హైద్రాబాద్ లోని ఒక ప్రవేట్ క్రిటికల్ కేర్ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న అప్పన్న హస్త మిత్రబృందం వారు ఆదివారం వారి కుటుంబ సభ్యులకు గజ్వేల్ లోని కార్యాలయం వద్ద ఖర్చుల నిమిత్తం నగదు రూ. 20000 అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాశికంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్, కోషాధి కారి కొల్లూరి శ్యామ్ ప్రసాద్, సహాయ కార్యదర్శి కొలిచెల్మే స్వామి, సభ్యులు రాణి, రాజు, రాంబాబు, శ్రీకాంత్, అరవింద్, బాలశేఖర్ రెడ్డి, నరేష్, గిరిబాబు, కిష్టయ్య తో పాటు నవీన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *