రైతులందరూ సారవంతమైన భూములను తయారుచేసుకొని అధిగ దిగుబడులు సాధించాలి
65 శాతం సబ్సిడీపై ఇచ్చే జీలుగా విత్తనాలను రైతులు అందరు సద్వినియోగం చేసుకోవాలి
ఎంపిపి పిల్లి రేణుక కిషన్, ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి
రైతులందరూ సారవంతమైన భూములను తయారుచేసుకొని అధిక దిగుబడులను సాధించాలని ఎల్లారెడ్డిపేట ఎంపిపి పిల్లి రేణుక కిషన్, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి లు అన్నారు,
ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో సోసైటీ గోదాం లో రైతులకు శుక్రవారం 65 శాతం సబ్సిడీపై ఇచ్చే జీలుగా విత్తనాలను ఎల్లారెడ్డిపేట ఎంపిపి పిల్లి రేణుక కిషన్ , సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి లు కలిసి పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ఎం పి పి పిల్లి రేణుక కిషన్, మాట్లాడుతూ 30 కిలోల జీలుగా విత్తనాల సంచిని 65 శాతం సబ్సిడీపై రైతులు అందరు కొనుగోలు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు,జీలుగా విత్తనాల వలన మంచి లగు వస్తుందనీ ఆమే గుర్తు చేశారు
ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి మాట్లాడుతూ మూడు సింగిల్ విండో సోసైటీ ల పరిధిలో 99 క్వింటాళ్ల జీలుగా విత్తనాలు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచామన్నారు ,
రైతులందరూ జీలుగా విత్తనాలను తమ పొలాల్లో చల్లుకొని మంచి సారవంతమైన భూములుగా తయారు చేసుకొని మరో పంటకు సిద్దం చేసుకోవాలని ఆయన కోరారు,మోతాదుకు మించి పొలాల్లో రైతులు ఎరువులు , రసాయనిక పదార్థాలు చల్లడంవల్ల భూముల్లో సారవంతం కోల్పోతుందని దీంతో పంటలకు అనేక రకాల రోగాలు వస్తున్నాయని రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు, రైతులు తమ పంట పొలాల్లో జీలుగా విత్తనాలతో పాటు జనుము వేప , కానుగ కొమ్మలను తొక్కాలని దీంతో భూములు సారవంతమై పంట మంచి దిగుబడి వస్తుందన్నారు, రైతులు ఆధునిక వ్యవసాయ పద్దతులతో అధికదిగుబడులు సాధించాలన్నారు,
ఈ పంపిణీ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు నేవూరి వెంకట్ నర్సింహారెడ్డి , కస్తూరి రాంచంద్రారెడ్డి, ల్యాగల సతీష్ రెడ్డి , బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి. ఎఇఓ లక్ష్మన్ , సోసైటీ సెక్రెటరీ కిషోర్, ఉద్యోగులు బురుక ఎల్లం , శ్రావన్ , బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ఎలగందుల నరసింహులు , ఎల్లయ్య , బాయికాడి రాజయ్య , రైతులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి , ధర్ర దేవయ్య , రాజేందర్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు,
