…ఆడబిడ్డకు పుస్తే మట్టెలు అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల్ తెరాస బి సి సెల్ అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్ చేబర్తి గ్రామానికి చెందిన కీ.శే. జాలని మధనమ్మ, జాలని బాల్ నర్సయ్య కుమార్తె భవాని(లాస్య) వివాహానికి మ్యాకల కనకయ్య ముదిరాజ్, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి చేతుల మీదగా పుస్తే మట్టెలు అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజా సేవ చేయడం సంతృప్తిని ఇస్తుంది అని సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవకు వినియోగించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలొ చేబర్తి ఉప్ప సర్పంచ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సురేష్, సాయిలు,వార్డు సభ్యులు ఆంజనేయులు ,రవి,యాదగిరి, చిన్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు





