ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి… జూనియర్ అసిస్టెంట్ బైరి సోనీ.

95 Views

 

 

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే12, ముస్తాబాద్ మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం ఆధ్వర్యంలో మండలంలోని బిజెపి నాయకులు కార్యకర్తలు కొవ్వొత్తులతో స్వామి వివేకానంద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. ఈసందర్భంగా కనమేని చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి మరో మహిళ బలైపోయిందని ఈగవర్నమెంట్ చేసే కార్యకలాపాల వల్ల ఒక నిండుప్రాణం హరిచిపోయింది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గత 15 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే ప్రతిపక్షాలు కూడా రెగ్యులర్ చేయాలని వారందరూ కూడా జూనియర్ అసిస్టెంట్ కార్యదర్శులకు సంఘీభావం తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వం కావాలని అడుగుతున్నారని కోపం పెట్టుకొని రెగ్యులర్ చేయకుండా అసెంబ్లీలో ఇచ్చిన మాటను పక్కనపెట్టి తనమాటమీద తననే నిలబడకుండా గవర్నమెంట్ తరఫున వారి ఇంటికి నోటీసులు అంటించి వారి మనోధైర్యాన్ని కోల్పోయే స్థితికి దిగజారించి ఒక సోదరి ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా తీసుకపోయిందని కండ్లకు కట్టినట్టు కనబడుతూనే ఉందని తెలిపారు. ఈరోజు ఒక మహిళా చనిపోయింది ఆమె పిల్లలు ఈరోజు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని కానీ ఈప్రభుత్వం గ్రహించాలని ఈసందర్భంగా బైరి సోనీ బలర్మణానికి పాల్పడినందున ముస్తాబాద్ లో ఈవిషయం తెలియగానే బైరి సోనీకి ఆత్మకు శాంతి చేకూర్చాలని భావనతో కొవ్వొత్తులర్యాలీ తీసి అశ్రునివాళి అర్పించి వారికి శ్రద్ధాంజలి ఘటించి మేంఎంతో చింతిస్తున్నాం వారికోసం మేము ఐదు నిమిషాల పాటు మౌనంపాటించాము. ఇప్పటికైనా వారి శిబిరానికి వెళ్లి వారికి రెగ్యులర్ చేయాలని ఇంతకుముందే మేము సంఘీభావం తెలపినాము మీరు ధైర్యంగా ఉండాలని ఓవైపు చెపుతూ ఉండగా పాపము ఆమె మనోధైర్యం కోల్పోయి నాపిల్లలకు స్కూలు ఫీజులు కూడా కట్టలేము తెచ్చిన అప్పులు తీర్చలేము నాఇంటి పూట గడపలేనని నిరాశతో లోనై తెలంగాణ రాష్ట్రంలో బైరి సోనీ ఆత్మబలైంది ఇక ముందు అమాయక ప్రజలు ఆత్మహత్య చేసుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు కనమేని చక్రధర్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఆ కుటుంబానికి 50, లక్షలకు పైచిలుకుఅందించాలని సీనియర్ నాయకులు జిల్లా అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి కోరారు. ఈకార్యక్రమంలో  మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కోలకృష్ణ గౌడ్, కరెడ్ల రమేష్ రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు వరి వెంకటేష్, పిఏసిఎస్ డైరెక్టర్ ఏళ్ల గిరిధర్ రెడ్డి, మీసా శంకర్, పప్పుల శ్రీకాంత్, వరగంటి సత్యం, బండి శ్రీకాంత్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *