Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో పోలీస్ స్టేషన్లో ఠాణా దివస్…

141 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ..

మే 2వ తేదీ (మంగళవారం రోజున) ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ లో”ఠాణా దివస్…

ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో మే 2 వ తేదీ మంగళవారం రోజున నిర్వహించే “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ఒ క ప్రకటనలో తెలిపారు..*

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందని,ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని, ప్రజల నుండి స్వయంగా విన్నపాలు స్వీకరించి, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడం కోసం చేపట్టిన “ఠాణా దివస్” కార్యక్రమంలో భాగంగా తేదీ 02-05-2023 మంగళవారం రోజున ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ లో ఉదయం 10:30 గంటల నుండి అందుబాటులో ఉండి ఎల్లారెడ్డిపేట్ మండల పరిధిలోని గ్రామాల ప్రజల నుండి అర్జీలను స్వయంగా స్వీకరించి,దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులను,గ్రామాల్లో ఉన్న సమస్యలను చట్టపరంగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. మండల పరిధిలోని గ్రామాల ప్రజల ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు,ఫిర్యాదులను తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవలసిందిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *