ప్రాంతీయం

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

116 Views

తోగుట

; కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండలంలోని బండారు పల్లి సర్పంచ్ కుంభం శారదా రఘోత్తమ్ రెడ్డి పిలుపునిచ్చారు. బండారుపల్లిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య, ఎంపీటీసీ మాష్ఠి సుమలతలతో కలిసి ప్రారంభించారు..ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ 7 రోజుల పాటు గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు.. శ్రీకాంత్ రెడ్డి, దోమల కొమురయ్యలు మాట్లాడుతూ ఇప్పటివరకు 8 గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమం పూర్తి అయిందని వారు తెలిపారు. ఇప్పటి వరకు 9505 మందికి కంటి పరీక్షలు చేయగా, 1963 మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేయడం జరిగిందన్నారు…2700 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు.. అలాగే 1251 మందికి వివిధ కారణాల చేత ఆపరేషన్ల కోసం రిఫర్ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ జహీర్, డా; రాదా కిషన్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు బోధనం కనకయ్య, ఉప సర్పంచ్ రమేష్, phc సూపర్ వైజర్లు స్వామి, శైలజ, మార్కెట్, ఆత్మ కమిటీ చైర్మన్ కిరణ్ కుమార్ రెడ్డి, సతీష్, కార్యదర్శి అశ్విని, నాయకులు పరమేశ్వర రెడ్డి, నీల రాజయ్య, శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, మర్పడగ భిక్షపతి, శ్రీనివాస్ రెడ్డి, శంకరయ్య, కరుణాకర్, నీల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *