*పెద్దపల్లి–మంచిర్యాల అభివృద్ధికి రూ.4,000 కోట్ల ప్రాజెక్టులు – సెమీకండక్టర్ ఫెసిలిటీపై కేంద్రానికి వినతి*
*న్యూఢిల్లీ:*
పెద్దపల్లి–మంచిర్యాల జిల్లాలకు సంబంధించిన రూ.4,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై ఎంపీ పార్లమెంట్‌లో కేంద్ర రైల్వే, ఐటీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని ప్రశ్నించారు. ప్రాజెక్టుల స్థితిగతులపై పూర్తి వివరాలతో సమాధానం ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
అదే సమయంలో, తెలంగాణకు తీసుకురావాల్సిన సెమీకండక్టర్ ఫెసిలిటీ రాజకీయ కారణాలతో ఆంధ్రప్రదేశ్‌కు తరలించడంపై ఎంపీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ ప్రాజెక్టు తెలంగాణకు వచ్చి ఉంటే వేలాది యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగేవని పేర్కొన్నారు. స్పష్టమైన ప్రపోజల్ ఇవ్వాలని కేంద్రం సూచించగా, దానిపై అన్ని అవకాశాలు పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.
ఈ నేపథ్యంలో మంత్రి అశ్విని వైష్ణవ్ ని ఎంపీ వ్యక్తిగతంగా కలిసి, పెద్దపల్లి–మంచిర్యాల ప్రాంతంలో ఉన్న నీటి వనరులు, భూమి లభ్యత, నైపుణ్యం కలిగిన యువత ప్రతిభను వివరించారు. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్, సింగరేణి సంస్థల విజయాన్ని ఉదాహరణగా చూపుతూ, ఈ ప్రాంతం పరిశ్రమలకు అత్యంత అనుకూలమని తెలిపారు. సెమీకండక్టర్ ఫెసిలిటీ ఏర్పాటు అయితే రాష్ట్ర అభివృద్ధికి, యువత భవిష్యత్తుకు గణనీయమైన ప్రయోజనం ఉంటుందని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు.





