ప్రాంతీయం

మల్లన్నసాగర్ తో సస్యశ్యామలం రోడ్లన్ని తల తలా మెరువాలే..దుబ్బాక సమగ్ర అభివృద్దే మా లక్ష్యం బీఆర్ఎస్ కార్యకర్తల కు అండగా ఉంటాం మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి

104 Views


తొగుట: గంజి, మెతుకులు తాగి, అటుకులు బుక్కి తెలంగాణ ఉద్యమానికి ఉపిరులు ఊదిన ఘనత మన దుబ్బాక నియోజకవర్గ కార్యకర్తలకే దక్కుతుందని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు..ఇటీవల మరణించిన కాన్గల్ కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరుపల్లి శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు.. శ్రీనివాస్ గౌడ్ అకాల మరణం పట్ల ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. శ్రీనివాస్ గౌడ్ భార్య సుమలత, కుమార్తె ప్రియదర్శిని, తల్లి భాగ్యమ్మ లను ఆయన పరమార్శించి, రూ. 20 వేల ఆర్ధిక సహాయం అందించారు.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మండలంలోని గుడికందుల గ్రామంలో ఇటీవల మరణించిన మాజీ సొసైటీ డైరెక్టర్ బైండ్ల రామస్వామి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామారం గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను ఎంపీ గారు పరామర్శించి ఆర్ధిక సహాయం అందించారు..వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం తొగుటలో గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిలివేరి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నర్సాగౌడ్ అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయనను పరామర్శించి ఆర్ధిక సహాయం అందించారు.
*మల్లన్న సాగర్ ఫలితాలు అందుతున్నాయి..పెద్ద చెరువులో నీళ్లు చూసి ఖుషీ అయిన ఎంపీ గారు*
కరువు కాటకాలకు నిలయమైన దుబ్బాక నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ గారి చొరవతో సాగునీటి గోస తీరిందని ఎంపీ గారు పేర్కొన్నారు. కాన్గల్ పెద్ద చెరువు వద్ద నిర్మిస్తున్న గంగమ్మ దేవాలయంను ఆయన సందర్శించారు. ఎండా కాలంలో చెరువు నిండా నీళ్లు ఉండటంతో చెరువులోకి దిగి నీళ్లను చూసి ఖుషీ అయ్యాడు..ఇందు కోసమే కదా మనం తెలంగాణ తెచ్చుకుంది అని ఆయన పేర్కొన్నారు. మల్లన్న సాగర్ నుండి నీటిని విడుదల చేయడంతో ఈప్రాంతం లోని చెరువు, కుంటల్లోని, వాగు వంకల్లోకి పుష్కలంగా నీళ్లు నిలువ ఉండటం జరిగిందన్నారు. కరువు పరిస్థితుల్లో వానాకాలం లో ఎండిపోయే కూడవెల్లి వాగు నేడు మల్లన్న సాగర్ మూలంగా జీవనదిగా మారిందన్నారు..పూర్తిస్థాయిలో కాలువల నిర్మాణంకు రైతులు సహకరిస్తే నియోజకవర్గం మొత్తం గోదావరి జలాలు కలియ తిరుగుతాయన్నారు..అనంతరం కాన్గల్ లో మే 4నుండి నిర్వహించనున్న పెద్దమ్మ వార్షికోత్సవం ఆహ్వాన పత్రికను ముదిరాజ్ సంఘం ప్రతినిధులు ఎంపీ గారికి అందించారు..
*దుబ్బాక సమగ్ర అభివృద్దే మా లక్ష్యం*
గెలుపోటములతో సంబంధం లేకుండా దుబ్బాక నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కి కృషి చేస్తున్నామని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు. వాగ్గడ్డ నుండి జప్తిలింగారెడ్డిపల్లి మీదుగా పెద్ద చెప్యాల వరకు జరుగుతున్న బీటీ రోడ్డు రిన్యూవల్ పనులను జప్తిలింగారెడ్డి పల్లిలో ఎంపీ గారు పరిశీలించారు.. పనులు నాణ్యతతో జరగాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు..తొగుట మండలంలో అన్ని బీటీ రోడ్లను రూ.10.కోట్లతో రిన్యూవల్ చేయడం జరుగుతుందన్నారు..సూరంపల్లి వేంకట్రావుపేట రోడ్డు పనులు పూర్తయ్యాయని, మిగతా రోడ్లు పూర్తి చేస్తామన్నారు. ఆర్అండ్ బీ శాఖా ద్వారా మండలంలోని చందాపూర్ – కొల్గుర్ రోడ్డుకు రూ. 3.40 కోట్లు, మెట్టు – వేంకట్రావుపేట రోడ్డుకు రూ.4 కోట్లు, మెట్టు- అల్వాల రోడ్డుకు రూ. 13.22 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. మెట్టు వేంకట్రావుపేట రోడ్డు పనులు పూర్తయ్యాయని, మిగతా రోడ్ల పనులు కొనసాగుతున్నాయన్నారు..కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, సొసైటీ చైర్మన్ కన్నయ్యగారి హరికృష్ణా రెడ్డి, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ఆత్మ కమిటీ ఛైర్మన్ నమిలే భాస్కర చారి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరి మల్లారెడ్డి, సర్పంచ్ లు ఎం ప్రేమల చంద్రారెడ్డి, గంగనిగల్ల మల్లయ్య, తోయేటి ఎల్లం, సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు మాదాసు అరుణ్ కుమార్, గ్రామ పార్టీ అధ్యక్షులు పులి రాజు, కనకయ్య, సిలివేరి శ్రీనివాస్ గౌడ్, తగరం అశోక్, నంట పరమేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు నందారం నరేందర్ గౌడ్, బాల్ రెడ్డి, నాయకులు సుతారి రమేష్, రమేష్ గౌడ్, గురువారెడ్డి, కాముని లక్ష్మీనారాయణ, శ్రీధర్, ఎల్లం, హాన్మంతరెడ్డి, ఈశ్వర్, రామోల్ల అనిల్, చింత బైరెడ్డి, రాజశేఖర్, మంగ యాదగిరి, మహేష్ తదితరులు పాల్గొన్నారు…

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *