ప్రాంతీయం

డాక్టర్ చింతోజు శంకర్ కు ఆత్మీయ సన్మానం…

481 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 18,  ముస్తాబాద్ మండలంలో గల పీపుల్స్ హాస్పిటల్ చింతోజు శంకర్ డాక్టర్ కు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం చేశారు. ఓకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లిని సురక్షితంగా ఆపరేషన్ చేసి మరియు కడుపులో 10 కిలోల కంతితో ఉన్న పిట్ల శివానికి నలుగురు డాక్టర్లు సమక్షంలో ఆపరేషన్ చేసి సురక్షితంగా బయట పడ్డ పిట్ల శివానీ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఎల్లారెడ్డిపేట సభ్యులు పరామర్శించి డాక్టర్ చింతోజు శంకర్ కు శాలువా కప్పి సన్మానం చేసి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఎల్లారెడ్డిపేట ప్రధాన కార్యదర్శి వంగాల వసంత్ కుమార్ మాట్లాడుతూ చింతోజు శంకర్ డాక్టర్ విశ్వబ్రాహ్మణ జాతిలో పుట్టడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని ఇప్పటికే లక్ష ఆపరేషన్లు చేసిన ఘనత చింతోజు కుటుంబానికి దక్కిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వంగాల వసంత్ కుమార్, వంగాల సురేందర్, చేపూరి శ్రీనివాస్, లక్ష్మణ్ చారి, దుంపటి వీరాచారి, ప్రభాకర్ చారి తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *