ఘనంగా డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి
సీద్దిపేట జిల్లా గజ్వేల్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు సాధారణంగా భారతదేశంలో పుట్టడం మన అదృష్టం అని అనుకుంటాం కదా… డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ భారత గడ్డపై పుట్టడం… భారతదేశ అదృష్టంగా భావించవచ్చు. మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి కౌన్సిలర్ బొగ్గుల చందు మాట్లాడుతూ ఆయన మామూలు వ్యక్తి కాదు… మహోన్నత భావాల శక్తి. ఆయన జీవితం కన్నీటి సంద్రం. ప్రతి రోజూ పోరాటాల మయం. చుట్టూ అవమానాలు, హేళనలు చేసే సమాజం…. అంటరానివాడిగా ముద్ర. ఏం చేద్దామన్నా సమస్యే. ఒక్క అడుగు ముందుకు వేసేలోపు.. వెనక్కి లాగేసేలా వంద అడుగుల కుటిల యత్నాలు. అలాంటి చోట… అన్నింటినీ మౌనంగా భరిస్తూ, పర్వతమంత సహనంతో మెలగుతూ… ఉలి చెక్కిన శిల్పంలా తనను తాను మలచుకుంటూ… రాజ్యాంగ నిర్మాతగా మారి.. ఈ దేశానికి సరైన దిశా నిర్దేశం చేసిన గొప్ప వ్యక్తిడాక్టర్_బాబా_సాహెబ్_భీమ్‌రావ్_రాంజీ_అంబేద్కర్.తమ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఆ మహనీయుడికి ఏం చేసినా తక్కువే అని భారతీయులు శాశ్వతంగా కీర్తించే అంబేద్కర్… బడుగు బలహీనుల అభ్యున్నతి కోసం అహరహం కృషి చేశారు. సాధారణ నేతలైతే పేదలకు మాటలతో హామీలు ఇచ్చి… చేతల్లో చేయకపోవచ్చు అని భావించిన ఆయన.. రాజ్యాంగ నిర్మాణంలోనే పేదలకు కచ్చితమైన భరోసాని, భవిష్యత్తుని ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించారు. అందుకే ఆయన్ని వాడవాడలా గుండెల్లో పెట్టేసుకుంటారు ప్రజలు. ఆయన జయంతిని తమ పుట్టిన రోజులా జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు సంఘపురం ఎల్లయ్య. వార్డు అధ్యక్షులు బాకిస్వామి. ఉపాధ్యక్షులు అటకూరి స్వామి. సంగపురం నర్సింలు. పాములపర్తి స్వామి. చంటి ప్రవీణ్. నిరుడి శ్రీను. నీరుడి కుమార్. కరుణాకర్. తదితరులు పాల్గొన్నారు
