®️వేకువ జామునే ‘(బ్రహ్మ ముహూర్తంలో)’ మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి.
®️’కావు కావు’ అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు.. ఏవీ నీవి కావు, ఏవీ శాశ్వతమూ ‘కావు కావు’ అని అందరికీ గుర్తు చేస్తూ ‘బోధిస్తూ’.. అందరినీ తట్టి లేపేది కాకి.
®️ఎక్కడయినా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న ‘అన్ని కాకులకు’ సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలసి ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి.
®️శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి ‘సంఘటితంగా పోరాటం’ చేపట్టేవి కాకులు.
®️ఆడ కాకి – మగ కాకి కలవడం కూడా ‘పరుల కంట’ పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం.
®️ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోధనలు చేసి స్నానమాచరించి గూటికిచేరే మంచి ఆచరణ కాకులదే.
®️సూర్యాస్తమయం సమయానికి గూటికిచేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే





