ప్రాంతీయం

చైనా మాంజా వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు. రాయపోలు ఎస్ఐ మానస.

30 Views

నిషేధిత చైనా మాంజాను వినియోగించినా, విక్రయించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాయపోలు ఎస్ఐ మానస అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చైనా మాంజా కారణంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పక్షులు తీవ్రంగా గాయపడటమే కాకుండా ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చైనా మాంజాపై నిషేధం విధించిందని గుర్తు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా చైనా మాంజాను వినియోగించినా, విక్రయించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. మండలంలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ పిల్లలను చైనా మాంజా వినియోగానికి దూరంగా ఉంచాలని సూచించారు. రాయపోల్ మండలంలో ఎక్కడైనా నిషేధిత చైనా మాంజా వినియోగం లేదా విక్రయం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆమె కోరారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *