ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 1, ముస్తబాద్ మండల బిజెపి అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డిని బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి పెంజర్ల కళ్యాణ్ ల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ముస్తాబాద్ మండల ప్రధాన కార్యదర్శి కోల కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై దిష్టిబొమ్మ దహనం చేశారు ..
మూడు రోజుల క్రితం సిరిసిల్ల నడిబొడ్డున భారత జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ను అవమాన పరుస్తూ గుట్కా తంబాకులతో బండి సంజయ్ చిత్రపటం మీద పోసి బిఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు..
ఇలా చేస్తే బిఆర్ఎస్ నాయకుల మీద ఈ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో చర్యకు ప్రతిచర్యగా ముస్తాబాద్ మండల కేంద్రంలో కేసీఆర్ కేటీఆర్ ఈ బంగారు తెలంగాణ ఒక తాగుబోతు తెలంగాణగా మార్చినటువంటి ఘనులు ఈ కల్వకుంట్ల కుటుంబం..
అందుకే చిత్రపటాలకు నిన్నటి రోజున చీప్ లిక్కర్ తో అభిషేకం చేసాం అన్నారు..
ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముస్తాబాద్ మండల పోలీస్ శాఖ బిజెపి నాయకుల కుటుంబాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్ చేసే యోచనలో ఉన్నందున భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.. ఒకవేళ అరెస్టు వారిని అక్రమంగా కేసులు పెట్టి రిమాండ్ చేస్తే రేపు ముస్తాబాద్ మండలంలో బందుకు బీజేవైఎం పిలుపు ఇవ్వడం జరుగుతుందన్నారు..
ఇట్టి కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కోల కృష్ణగౌడ్, జిల్లా కార్యాలయ సహకార్యదర్శి బాధ నరేష్, బిజెపి మండల ఓ బి సి మోర్చా అధ్యక్షులు జిల్లల మల్లేశం, ఎస్ సి మోర్చా మండల అధ్యక్షులు కేసుగాని తిరుపతి, బీజేవైఎం మండల అధ్యక్షులు కుడకల జనార్ధన్,సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, మీసా శంకర్, సత్తయ్య, ఓరుగంటి సత్యం,మహేష్, కిట్టు, ఉపేంద్ర,బిక్షపతి, బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు.




