ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 24, పోతుగల్ అంబేద్కర్ నగర్ మండల పరిషత్ పాఠశాల పాత భవనం కూల్చి నూతన భవనం సిఎస్ ఆర్ నిధుల నుండి నిర్మాణ పనులు ప్రారంబించేశారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతం రావు, తెలంగాణ రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ , (పోతుగల్, గూడూరు) ఎంపీటీసీ కొండని బాలకిషన్, గ్రామశాఖ అధ్యక్షులు రేపాక బాల్ నర్స్, గ్రామశాఖ ఉప అధ్యక్షులు అనిల్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
