దౌల్తాబాద్: తాళం వేసి ఉన్న నాలుగు ఇళ్లల్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో రెడ్డి చంద్రయ్య ఇంట్లో 80 వేలు, జీనత్ బేగం ఇంట్లో 12 వేలు, ఆది విమల ఇంట్లో 7.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 వేల రూపాయలు చోరీ అయినట్లు తెలిపారు. మద్దికుంట నర్సింలు ఇంటి తాళం పగలగొట్టినా, ఎలాంటి వస్తువులు పోలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం తో దొంగతనం జరిగిన ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకుంటామని ఎస్ఐ పేర్కొన్నారు..
