విద్య

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ..

115 Views

(తిమ్మాపూర్ మర్చి 11)

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట జడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు రేణిగుంట కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఎలుక రాజు సోమవారం పరీక్ష ప్యాడ్ల తో పాటు రెండు పెన్నులను బహుకరించారు.

ఈ సందర్భంగా ఎలుక రాజు మాట్లాడుతూ.

నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకొని దృఢ సంకల్పం, పట్టుదలతో విజయతీరాలను చేరేవరకు నిర్విరామంగా కృషి చేయాలని క్రమం తప్పకుండా శ్రమిస్తే కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని విద్యార్థులు కష్టపడి కాకుండా, ఇష్టంతో చదివి పరీక్షలలో 10/10 జి పి మార్కులు సాధించాలని విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకొని, పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి ఎలుక శ్రీధర్,స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు…

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్