బహుజన నేత కాన్షిరాం జయంతి సదర్భంగా ఆయనకు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మన్నే కృపానందం మాల మహానాడు రాష్ట్ర నాయకుడు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం బోధిసత్వ అంబేడ్కర్ కలలపంట సామ్రాట్ కాన్షీరామ్ . “నా ప్రజలు ఈ దేశంలో పాలితులుగా కాక పాలకులుగా ఉండాలి” అని అంబేద్కర్ కన్న కలల్ని సాఫల్యం చేశాడు మాన్యశ్రీ కాన్షీరామ్. స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఒక చమార్ మహిళను ముఖ్యమంత్రిగా చేసి చెప్పులు కుట్టే చేతులకు రాజదండాన్ని అందించాడు.1956 డిసెంబర్ 6వ తేదీన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మరణించేరోజు వరకూ కాన్షీరామ్ కు అంబేద్కర్ గురించి ఏమీ తెలియదు. అప్పటికి ఆయన బీఎస్సీ పూర్తిచేసి డెహ్రాడూన్లోని స్టాఫ్ కాలేజీలో ఉన్నత విద్య పూర్తి చేశాడు. కొంతకాలం భారతీయ భూ వైజ్ఞానిక సర్వే విభాగంలో ఉద్యోగం చేశాడు అదే సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన బాబాసాహెబ్ అంబేడ్కర్ చనిపోయారు. కాన్షీరామ్ తో పాటు ఉద్యోగం చేస్తున్న ఆయన మిత్రుడు గైని అంబేడ్కర్ మరణవార్తను తట్టుకోలేక మూడు రోజులపాటు అన్నం నీళ్లు మానివేసి కంటికి మంటికి ఏకధారగా విలపిస్తుంటే కాన్షీరామ్ కదిలిపోయాడు. అప్పటివరకూ అంబేడ్కర్ పేరు వినడమే కానీ ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన నడిపిన సామాజిక-రాజకీయ ఉద్యమాలను తెలుసుకొనే అవకాశం ఆయనకు రాలేదు. అయితే మిత్రుడు గైని వల్ల కాన్షీరామ్ అంబేడ్కర్ పట్ల , ఆయన రాజకీయ ఆశయాల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆయన జీవితాన్ని, ఉద్యమాన్ని ,రచనలని లోతుగా అధ్యయనం చేసి బాబా సాహెబ్ సిద్ధాంతాన్ని గుండెల్లో నింపుకున్న మహామనిషి కాన్షీరామ్. తాను ఈ దేశంలో అనచబడుతున్నటువంటి వ్యక్తులకు రాజ్యాదికారమే అంతిమ లక్ష్యంగా దిశా నిర్దేశం చేసినటువంటి మహనీయుడు ,కావున ఆయనకి భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది .పదవులు ముఖ్యం కాదు,బహుజన సమాజ నిర్మాణమే నా కర్తవ్యం అని ఆచరణ లో చూపిన గొప్ప వ్యక్తి కాన్షీరాం ఈవే మా జోహార్లు అని తెలిపారు





