సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం బిజీ వెంకటాపూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బొద్దు నాయక్ ఆధ్వర్యంలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలను బోధించారు. ఉపాధ్యాయులుగా తమ అనుభవాలను పంచుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొద్దు నాయక్ బహుమతులను ప్రదానం చేశారు.
