జగదేవపూర్ మండలంలోని రాయవరం గ్రామ పంచాయతిలో జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపిడివో శ్రీనివాస్ వర్మ మరియు సర్పంచ్ కుక్కల పావని కనకరాజు సందర్శించారు. తరువాత సర్పంచ్ పావని కనకరాజు మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అని ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాలని, ఈ కార్యక్రమం దేశంలోనే మనరాష్ట్రం లోనే అమలావుతున్న కార్యక్రమం అని ఈ కార్యక్రమం చేపట్టినందుకు కెసిఆర్ కి కృతజ్ఞతలు తెలిజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిడివో శ్రీనివాస్ వర్మ, సర్పంచ్ కుక్కల పావని కనకరాజుతో పాటు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.