రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య కు జిల్లా మున్నూరుకాపు సంఘం ఆద్వర్యంలో ఈ నెల 23 న ఉదయం 11-00 గంటలకు సిరిసిల్ల మున్నూరుకాపు సంఘం కళ్యాణ మండపంలో ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేసినట్లు రాజన్న సిరిసిల్ల ముకాస జిల్లా అద్యక్షులు దుమాల శ్రీ కాంత్ తెలిపారు ,
ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి మండల శాఖలకు చెందిన , గ్రామ శాఖ ల కు చెందిన అధ్యక్ష కార్యదర్శులతో పాటు మున్నూరు కాపు సంఘాలకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్య నాయకులు తప్పక హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు,
