శ్రీ దుర్గామాతను దర్శించుకున్న జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావ్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ దుర్గా మాత నూతన ఆలయానికి వెళ్లి ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు శుక్రవారం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు,
ఆలయకమీటీ వారు శ్రీ దుర్గా మాత ప్రతిష్ట మహోత్సవం అనంతరం మొట్టమొదటిసారిగా శుక్రవారం శ్రీ దుర్గామాత కు నూతన వస్త్రాల అలంకరణ చేశారు,
ఈ సందర్భంగా జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు ను ఆలయ కమిటీ వారు ఆహ్వానించగా ఆయనతో పాటు సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి , ఆలయ కమిటీ చైర్మన్ రావుల మల్లారెడ్డి , నంది కిషన్ , సద్ది లక్ష్మారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, కృష్ణ నాయక్ తండా సర్పంచ్ ప్రభు నాయక్ , డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ,కళ్యాణ్ నాయక్, తదితరులు శ్రీ దుర్గామాతను దర్శించుకుని మాత కృపకు పాత్రులయ్యారు, అనంతరం ఆలయకమీటీ వారి తీర్థ ప్రసాదాలను వారు స్వీకరించారు,
