ప్రాంతీయం

నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాల పరిశీలన–ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు

3 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

*నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాల పరిశీలన–ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు*

*పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి అనువైన స్థలాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం*

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రతిపాదించిన స్థలాలను ప్రభుత్వ విప్,శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు,జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎలిగేడు మండలంలో ఏర్పాటు చేయనున్న నూతన పోలీస్ స్టేషన్‌కు ప్రతిపాదించిన స్థలాన్ని, పెద్దకల్వలలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేయనున్న నూతన పోలీస్ స్టేషన్ స్థలాన్ని, పెద్దపల్లిలోని వ్యవసాయ మార్కెట్‌లో మహిళా పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేయనున్న నూతన పోలీస్ స్టేషన్ స్థలాన్ని, అలాగే పెద్దపల్లి మండలంలోని బంధంపల్లి గ్రామంలో ఏర్పాటు చేయనున్న రూరల్ పోలీస్ స్టేషన్ స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ, ప్రజలకు మరింత మెరుగైన భద్రతా సేవలు అందించేందుకు నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అవసరమని తెలిపారు.పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి అనువైన స్థలాల ఎంపికపై సమగ్ర నివేదికను సోమవారం సాయంత్రంలోపు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ద్వారా ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువవుతాయని, శాంతిభద్రతల పరిరక్షణలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాశ్ రావు,పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి బి. గంగయ్య,పోలీస్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *