Breaking News

*చెక్ డ్యాంల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి*

236 Views

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

రాజన్న సిరిసిల్ల: తెలుగున్యూస్24/7

జిల్లాలో నిర్మిస్తున్న చెక్ డ్యాంల నిర్మాణ పురోగతిలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 155 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 24 చెక్ డ్యాంల నిర్మాణ ప్రగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వేములవాడ మూలవాగు మీద 13, సిరిసిల్ల మానేరు వాగు మీద 11 చెక్ డ్యాంలు నిర్మిస్తున్నామని, అందులో ఇప్పటివరకు 2 చెక్ డ్యాంల నిర్మాణాలు వంద శాతం పూర్తయ్యాయని, 10 చెక్ డ్యాంలు 75 శాతం పూర్తయ్యాయని, మిగతా 12 చెక్ డ్యాంల నిర్మాణాలు వేగవంతం చేసేందుకుగాను తగిన చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ కు అధికారులు వివరించారు. ప్రతీ చెక్ డ్యాంకు ఒక తేదీని లక్ష్యంగా నిర్దేశించుకుని సాధ్యమైనంత త్వరగా నిర్మాణాలు అన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మానేరు తీరాన 3 కిలోమీటర్ల మేర నిర్మించనున్న కరకట్ట పనులపై కలెక్టర్ ఆరా తీశారు. ఇందుకోసం 31 కోట్ల నిధులు మంజూరు అవడం జరిగిందని, త్వరగా కాంట్రాక్టర్ తో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించేలా తగిన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. అలాగే గంభీరావుపేట మండల కేంద్రంలో నిర్మిస్తున్న మినీ ట్యాంకు బండ్ నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 5 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ మినీ ట్యాంకు బండ్ నిర్మాణ పనులు ఇప్పటికే 75 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ కు సంబంధిత అధికారులు వివరించారు.

ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ ఎస్ఈ శివకుమార్, ఈఈ అమరేందర్ రెడ్డి, డీఈఈ లు సంతోష్, రవికుమార్, నర్సింగ్, సత్యనారాయణ, కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7