రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామం పోడుభూమి భూమి లబ్ధిదారులు ఈరోజు సిరిసిల్ల సబ్ డివిజనల్ కమిటీ ఆర్డిఓ గారికి కార్యాలయానికి దరఖాస్తులను గుండారం పోడు భూమి లబ్ధిదారులు వ్యక్తిగత దరఖాస్తులను అందజేయడం జరిగింది. గుండారం ప్రజలు పోడు భూముల విషయంలో జాయింట్ సర్వే నిర్వహించి లబ్ధిదారులను గుర్తించి కొంత భూమి రెవెన్ రెవెన్యూ భూమి అని గ్రామపంచాయతీలో తీర్మానం చేసుకోవడం జరిగింది. వివాదాస్పద సర్వేనెంబర్ 147 లో కొంత భూమి ఫారెస్ట్ కి ఆనుకొని ఉండడం ద్వారా లబ్ధిదారుల మధ్య అనేక గొడవలకు దారితీస్తుంది ఆర్డీవో గారికి జాయింట్ సర్వే నిర్వహించాలని గుండారం ప్రజలు తన దరఖాస్తు ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ దరఖాస్తులన్నిటిని పోడుభూమి కమిటీ చైర్మన్ భానొత్ రాజు నాయక్ మరియు కమిటీ కార్యదర్శి జజ్జరి నర్సయ్య జంగం నరేష్ గూడెపు నరసయ్య అజ్మీర రాజు పోడుభూమి లబ్ధిదారులు భూక్యా శీను రాథోడ్ మున్సింగ్ రాథోడ్ ఇందిరాల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
