సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి లో సోమవారం సేవారత్న అవార్డ్ గ్రహీత, మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ కు గజ్వేల్ ప్రజ్ఞపూర్ సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుంటుకు రాజు, మార్కంటి కనకయ్య ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మేకల కనకయ్య ముదిరాజ్ సమాజ సేవలో ముందు వరసలో ఉంటూ గ్రామంలో పెళ్ళి కూతుళ్లకు స్వంత ఖర్చులతో పుస్తే,మట్టెలు అందజేస్తూ,నిరుపేదలకు అండగా నిలుస్తు,యువతకు క్రీడా పరికరాలు అందజేసి క్రీడా పోటీలు నిర్వహించడం,ఎవరికి ఆపద వచ్చినా నేను ఉన్న అంటూ ముదిరాజ్ సమాజంలో అందరికీ అండగా నిలుస్తున్న కనకయ్య ముదిరాజ్ సేవలు గుర్తించి హైదరాబాద్ లో ఇటీవల సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో సేవా రత్న అవార్డు పొందిన సందర్భంగా చిరు సన్మానం చేయడం జరిగింది అని అన్నారు




