ముఖ్యమంత్రి సభకు 5000 మందిని తరలిస్తాం
జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు
టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందె సుభాష్
డిసెంబర్ ఏడో తేదీన జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిర్వహించ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు ఎల్లారెడ్డిపేట మండలం నుండి 5000 మందిని తరలిస్తామని ఎల్లారెడ్డిపేట జెడ్ పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు తెలిపారు,
ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ , దుమాల గొల్లపల్లి , గుండారం గ్రామాలతో పాటు ,ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో. సమావేశాలను నిర్వహించి జగిత్యాల సభకు పెద్ద ఎత్తున.టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను. జనాన్ని తరలించి విజయవంతం చేయాలని జెడ్పిటిసి సభ్యులు చీటి లక్ష్మణ్ రావు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందె సుభాష్ లు పిలుపునిచ్చారు,
తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను వివరిస్తూ పలు గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కు దిశా నిర్దేశాలు చేసి సభకు సమాయత్తం చేశారు,
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ జెడ్ పిటిసి కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారం కృష్ణారెడ్డి ఎంపిటీసి మల్లేశం , ,నేవూరి మమతారెడ్డి , ఎస్పీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్ , మహిళా అధ్యక్షురాలు శ్యామ మంజుల, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిల్లి కిషన్ ,రాజు నాయక్ ,జంగిడి సత్తయ్య , తడకల దేవరాజు ,. గోగూరి ప్రదీప్ రెడ్డి ,కొత్త. శ్రీ నివాస్ , నంది కిషన్ , మీసం రాజం , మేగి నరసయ్య ,నేవూరి వెంకట నరసింహారెడ్డి ,హాస్సన్ బాయ్ , కొత్త చెన్నయ్య , భాస్కర్ , నర్సయ్య , గడ్డమీద ఆనందం , మెండు శ్రీ నివాస్ యాదవ్ , బాధ రమేష్ , శ్యామంతుల అనిల్ , పురుషోత్తం , కిషన్ , పట్టణ అధ్యక్షులు దొనుకుల కళ్యాణ్ ,పవన్ గౌడ్ , వివిధ గ్రామ శాఖల.టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు , సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు వివిధ గ్రామాల వార్డు సభ్యులు , టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు




