ప్రాంతీయం

హెచ్ఐవీ నియంత్రణ లక్ష్యాల సాధనలో మంచిర్యాల జిల్లాకు ‘సురక్షిత జిల్లా’ గుర్తింపు – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

10 Views

తెలుగు న్యూస్ మంచిర్యాల:

జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్దేశించిన హెచ్ఐవీ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా 95:95:95 లక్ష్యాలను విజయవంతంగా సాధించిన మంచిర్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 20 సురక్షిత జిల్లాల జాబితాలో స్థానం సంపాదించిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అధికారుల బృందం కలెక్టర్ ను శాలువతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్ఐవి, ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల అమలులో జిల్లా యంత్రాంగం చూపిన అంకితభావం, సమర్థవంతమైన నాయకత్వం, వివిధ శాఖల మధ్య సమన్వయం, అందించిన సహకారంతో ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ, దిశ బృందం, వివిధ స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో జిల్లాలో హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు, చికిత్స సేవలు, ప్రజలలో అవగాహన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడం జరిగిందని, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమష్టిగా కృషితో నిర్దేశిత లక్ష్యాలను సాధించగలిగామని తెలిపారు. హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలను విస్తృతం చేయడం, బాధితులకు సకాలంలో చికిత్స అందించడం, ప్రజలలో అపోహలను తొలగించి అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ మంచిర్యాల జిల్లాను సురక్షిత జిల్లాగా కొనసాగించేందుకు సమష్టిగా కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో టి జి ఎ సి ఎ సి ఎస్ జాయింట్ డైరెక్టర్ (ప్రివెన్షన్) కె.ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. నరేందర్ రాథోడ్, హెచ్ఐవి/ఎయిడ్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. సుధాకర్ నాయక్, దిశ సిపిఎం నీలిమ, మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, సిఎస్ఓ రాజేష్, డీఎండీఓ సంతోష్, అధికారులు, మంచిర్యాల సంపూర్ణ సురక్ష కేంద్రం బృందం సభ్యులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *