ప్రాంతీయం

హైదరాబాద్‌లో నిర్వహించిన” అంతర్జాతీయ భారత్ సమ్మిట్‌లో” పాల్గొన్న *బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి

12 Views

తెలుగు న్యూస్ బెల్లంపల్లి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, AICC, సంవృద్ధి భారత్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ భారత్ సమ్మిట్–2026 కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే  గడ్డం వినోద్ వెంకటస్వామి పాల్గొన్నారు. వారితో ముచ్చర్ల మల్లయ్య  నెల్లి రమేష్ MD.గౌస్ కాంగ్రెస్ నాయకులు,బంటి పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 దేశాలకు చెందిన ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, విధాన రూపకర్తలు పాల్గొంటున్న ఈ అంతర్జాతీయ సదస్సు ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, యువత భవిష్యత్తు, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ సహకారం వంటి కీలక అంశాలపై చర్చలకు వేదికగా నిలుస్తోంది.తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు, ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారం, అభివృద్ధి, ప్రజాస్వామ్య విలువల బలోపేతానికి ఈ సదస్సు ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *