ప్రాంతీయం

2509మంది చేయూత పెన్షన్ లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరి పత్రాల పంపిణీ

8 Views

తెలుగు న్యూస్ మంచిర్యాల:

మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు.మంచిర్యాల పట్టణంలోని పద్మ నాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన 2261మందికి మరియు హజీపూర్ మండలానికి చెందిన 248 మందికి చేయూత పెన్షన్ లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరి పత్రాలను మంచిర్యాల జిల్లా కలెక్టర్  కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య  పాటు సంబంధిత అధికారులతో కలిసి మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి. అర్హత ఉన్న ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదన్నదే మా ఆకాంక్ష.మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవతో 2509 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరి పత్రాలను అందించడం జరుగుతుందన్నారు.ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో నిరంతరం కృషి చేస్తాం. ప్రజా సంక్షేమమే మా ప్రధాన బాధ్యత” అని సురేఖ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, సింగిల్ విండో చైర్మన్ లు రాజేశ్వరరావు , తోట రవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాలే రాయలింగు, మంచిర్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అర్కాల హేమలత, మంచిర్యాల పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలత, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, సర్పంచులు , ఉప సర్పంచులు , వార్డు మెంబర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు,పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *