ప్రాంతీయం

యువత రాజకీయాల్లో, క్రీడా రంగంలో రాణించేలా ప్రోత్సహించాలి – ఎంపీ గడ్డం వంశీకృష్ణ

5 Views

*హైదరాబాద్: దేశ అభివృద్ధి, ప్రజాస్వామ్య బలోపేతంలో యువత కీలక పాత్ర పోషించాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు.*తెలంగాణ అభ్యుదయం – యువత మరియు రాజకీయాలు అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ పాల్గొని యువత రాజకీయాలు, క్రీడా రంగాల్లో భాగస్వామ్యంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి వచ్చి నాయకత్వ బాధ్యతలు చేపట్టేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా క్రీడా రంగంలో యువతకు మెరుగైన అవకాశాలు కల్పించి, ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై దేశానికి మరిన్ని పతకాలు సాధించే స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు.పెద్దపల్లికి చెందిన యువ క్రీడాకారిణి నికిత స్వర్ణ పతకం సాధించడం, మిక్స్‌డ్ డబుల్స్ షూటింగ్‌లో భారత క్రీడాకారులు సాధించిన విజయాలు యువతలో ఉన్న ప్రతిభకు నిదర్శనమని ప్రస్తావించారు. యువతకు సరైన అవకాశాలు, ప్రోత్సాహం కల్పిస్తే రాజకీయాలు, క్రీడలు సహా అన్ని రంగాల్లో రాణించి దేశ నిర్మాణంలో మరింత కీలక భాగస్వాములు అవుతారని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆకాంక్షించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *