ప్రాంతీయం

అప్పుల బాధతో యువకుడు మృతి.

7 Views

ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చలేక మనోవేదనకు గురైన రాంసాగర్ గ్రామానికి చెందిన కల్లూరి యాదగిరి (32) చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. రాయపోల్ పోలీసుల కథనం ప్రకారం.. యాదగిరి మూడేళ్ల క్రితం ఇంటి నిర్మాణం కోసం ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో రూ.5 లక్షల రుణం తీసుకున్నాడు. ఇంటి ఖర్చుల కోసం మరికొంత అప్పు చేశాడు. అప్పుల వాయిదాలు చెల్లించలేక గత కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీ రాత్రి ఇంటికి వచ్చిన అతడు అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు గజ్వేల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అనంతరం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స అందించారు. వైద్యులు గడ్డిమందు తాగినట్లు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం ఈ నెల 17న పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయపోల్ ఎస్‌ఐ బి.లింగం తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *