పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సిద్దిపేట సీపీ కార్యాలయంలో వడ్డేపల్లి గ్రామానికి చెందిన ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, యువకులు రక్తదానం చేశారు. సామాజిక బాధ్యతగా రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు తమ వంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకుడు రాజాగారి రాజా గౌడ్, ఉపసర్పంచ్ మర్యాల స్వామి, కరుణాకర్, మహేష్ గౌడ్, రవి, శివ తదితరులు పాల్గొన్నారు.





