ప్రాంతీయం

ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పుల్లూరు ఉమేష్..

18 Views

NHM ఉద్యోగుల నిరవధిక సమ్మెకు బీఎస్పీ సిద్దిపేట జిల్లా కమిటీ సంఘీభావం

ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పుల్లూరు ఉమేష్

సిద్దిపేట, అక్టోబర్ 27, తెలుగు న్యూస్ 24/7 

గత 15 రోజులుగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె చేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగులకు బహుజన్ సమాజ్ పార్టీ (BSP) సిద్దిపేట జిల్లా కమిటీ సంఘీభావం తెలిపింది.జిల్లాలోని 78 విభాగాలకు చెందిన సుమారు 500 మంది ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న నేపథ్యంలో బీఎస్పీ నాయకులు నేడు సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా బీఎస్పీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పుల్లూరు ఉమేష్ మాట్లాడుతూ, NHM ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో NHM ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

వైద్య ఆరోగ్య రంగంలో నిరంతరం సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.

15 రోజులుగా ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పటికీ వారి సమస్యలకు పరిష్కారం చూపకపోవడం విచారకరమని అన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని కోరారు.ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండనోళ్ల నరేష్, గజ్వేల్ అసెంబ్లీ ఇన్‌చార్జి కేతుజు వినోద్ చారి, అసెంబ్లీ అధ్యక్షులు కొమ్ము చంద్రం, సిద్దిపేట అసెంబ్లీ ఇన్‌చార్జి కిరణ్ పాల్గొన్నారు.

అలాగే గజ్వేల్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు శ్రీకాంత్, తూప్రాన్ మండల అధ్యక్షులు నరేష్, నవీన్ తదితరులు పాల్గొని NHM ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *