ప్రాంతీయం

వడ్డేపల్లిలో రూ.50 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం.

6 Views

మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో రూ.50 లక్షల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు ప్రారంభించారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి పనులు చేపట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంపీ నిధులతో పనులు ప్రారంభం కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. స్థానిక అవసరాలను గుర్తించి గ్రామాల సమగ్ర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి సర్పంచ్ రాజాగారి రేణుక రాజాగౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు మంకిడి స్వామి, వార్డు సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *