ప్రాంతీయం

ప్రభుత్వ వైద్య కళాశాలలో పారదర్శకంగా నియామక ప్రక్రియ,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

6 Views

ప్రభుత్వ వైద్య కళాశాలలో పారదర్శకంగా నియామక ప్రక్రియ,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

తెలుగు న్యూస్,అక్టోబర్ 23, 2026
ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తూ, అభ్యర్థుల ప్రతిభ, మెరిట్, అర్హతల ఆధారంగా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని హాజీపూర్ మండలంలో గల ప్రభుత్వ వైద్య కళాశాలలో దంత వైద్య విభాగంలో అధ్యాపకుల కొరకు నిర్వహించిన నియామక ప్రక్రియకు కళాశాల ప్రిన్సిపల్ దేవాజి, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు అశోక్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిబంధనల ప్రకారం పారదర్శకంగా చేపట్టడం జరిగిందని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక కోసం రాత పరీక్ష, పి.జి. మార్కులు, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకొని, అభ్యర్థుల విద్యార్హతలు, ప్రతిభ, అనుభవం తదితర అంశాలను పరిశీలించి మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఇంటర్వ్యూలో అభ్యర్థులు సాధించిన మార్కులతో పాటు, పి.జి. మార్కులకు నిర్దేశించిన వెయిటేజీని పరిగణనలోకి తీసుకొని తుది మెరిట్‌ను నిర్ణయించడం జరిగిందని, ఈ ప్రక్రియలో అభిషేక్ అత్యుత్తమ ప్రతిభ కనబరచగా, ఎంపిక చేసేందుకు కమిటీ నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఎంపికైన అభ్యర్థి త్వరలో విధులలో చేరేలా నియామక ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.

ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కళాశాల మైదానం అభివృద్ధి, క్రీడా వసతుల కల్పన, త్రాగునీటి సదుపాయం, ఇంటర్నెట్ సౌకర్యాల మెరుగుదలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *