ప్రాంతీయం

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

3 Views

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

తెలుగు న్యూస్ అక్టోబర్ 23, 2026:
జిల్లాలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. శుక్రవారం జిల్లాలోని భీమారం మండలంలోని భీమారం, భూరుగుపల్లి గ్రామ పంచాయతీల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, విద్యా కార్యక్రమాలు, పారిశుధ్య నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ పనులు, పలు ప్రభుత్వ పాఠశాలలు, భవిత కేంద్రం, పంట కుంటలు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణ పనులు, గ్రామ పంచాయతీ రికార్డులు, ఇంకుడు గుంతలు, సమీకృత ఎస్.సి., బి.సి. వసతి గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు, అభ్యాసనంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. భవిత కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులకు అందుతున్న సేవలు, సదుపాయాలను పరిశీలించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు వారి సామర్థ్యాలకు అనుగుణంగా బోధన, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. భీమారం గ్రామంలో చేపట్టిన పంట కుంట పనులను పరిశీలించి, వ్యవసాయ అవసరాలకు వర్షపు నీటిని నిల్వ చేసుకునేలా పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని, నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. భూరుగుపల్లి గ్రామ పంచాయతీలో వర్షపు నీటి సంరక్షణ నిర్మాణ పనులను ప్రారంభించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపునకు వినియోగించుకోవడం ఎంతో అవసరమని, నీటి సంరక్షణ పనులను ప్రణాళికాబద్ధంగా, నాణ్యతతో చేపట్టి నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూరుగుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను సక్రమంగా, ఎప్పటికప్పుడు నవీకరిస్తూ నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని, విధుల నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, పనుల పురోగతి, రికార్డుల నిర్వహణలో పూర్తి జవాబుదారీతనంతో పని చేయాలని తెలిపారు. గ్రామంలోని ఇంకుడు గుంతలను పరిశీలించి, నిర్వహణ తీరును సమీక్షించారు. గ్రామాలలో మురుగునీటి నిర్వహణ సక్రమంగా ఉండేలా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండల కేంద్రంలోని సమీకృత ఎస్.సి., బి.సి. వసతి గృహాలను సందర్శించి, విద్యార్థులకు అందుతున్న వసతి, భోజనం, త్రాగునీరు, పరిశుభ్రత తదితర సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, వసతి గృహంలో పారిశుధ్యం, మౌలిక సదుపాయాల నిర్వహణపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి వీణ, మండల విద్యాధికారి శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి సతీష్, ఏపీఓ, సంబంధిత గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *