లింగారెడ్డిపల్లి: నిరుపేదలకు అండగా నిలుస్తూ లింగారెడ్డిపల్లి సేవా సమితి తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఇటీవల మృతి చెందిన కొత్తోల్ల ఎల్లవ్వ కుటుంబానికి సేవా సమితి ఆధ్వర్యంలో రూ.5 వేల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ తోట శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామంలో ఎవరైనా నిరుపేద కుటుంబాలు ఆపదలో ఉంటే వారికి అండగా నిలవడమే సేవా సమితి లక్ష్యమని తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ షాదుల్ల, మాజీ ఎంపీటీసీ స్వామి, వార్డు సభ్యుడు మహిపాల్, మాజీ ఉపసర్పంచ్ మల్లేశం, నాగేష్, ఎల్లం, అనిల్, దేవదానం, నవీన్, స్వామి, కృపాకర్, విశాల్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.





