ప్రాంతీయం

పెద్దపల్లి పరిధిలో ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ పోటీలకు ఆహ్వానం

5 Views

తెలుగు న్యూస్ పెద్దపల్లి రామగుండం పోలీస్ కమిషనరేట్:

*ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ పోటీలకు ఆహ్వానం*

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ల కోసం ఫోటోగ్రఫీ మరియు షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణలో, సమాజ రక్షణలో విధి నిర్వహిస్తూ ప్రాణత్యాగం చేసిన అమర పోలీసుల సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21న నిర్వహించే పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పోలీసుల త్యాగాలు, సేవలు, విధి నిర్వహణలో వారి ప్రతిభను ప్రతిబింబించే విధంగా ఫోటోలు, షార్ట్ ఫిలిమ్స్ రూపొందించాలని సూచించారు.
ఆసక్తి గల వారు పోలీసులకు సంబంధించిన అంశాలపై తీసిన మూడు ఫోటోలు మరియు మూడు నిమిషాలకు మించని ఒక షార్ట్ ఫిలింను ఈ నెల 23వ తేదీ సాయంత్రంలోగా రామగుండం పోలీస్ కమీషనరేట్ స్పెషల్ బ్రాంచ్ (NIB) కార్యాలయంలో సమర్పించాలి. ఫోటోలు 10 × 8 అంగుళాల పరిమాణంలో ఉండాలి. షార్ట్ ఫిలింను పెన్‌డ్రైవ్‌లో పూర్తి వ్యక్తిగత వివరాలతో సమర్పించాలి.
కమీషనరేట్ స్థాయిలో ఎంపికైన మూడు ఉత్తమ ఫోటోలు, మూడు ఉత్తమ షార్ట్ ఫిలిమ్స్‌ను రాష్ట్రస్థాయి పోటీలకు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి పంపించనున్నట్లు సీపీ తెలిపారు.
యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోలీసుల సేవలు, త్యాగాలను సమాజానికి చాటిచెప్పే విధంగా తమ ప్రతిభను ప్రదర్శించాలని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *