శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్
తెలుగు న్యూస్ మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 44వ డివిజన్లో నిర్వహించిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ తూముల నరేష్ INTUC జిల్లా అధ్యక్షుడు పుదరి తిరుపతి , కార్పొరేటర్ చిలువేరు జ్యోతి శ్రీనివాస్ ,షేరు శ్రీలక్ష్మి పవన్ ,చిందం సత్యవతి శ్రీనివాస్ ,కొమకుల కిషన్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది సంజీవ్ ,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మేయర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులతో మంచిర్యాల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, పట్టణం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.





