ప్రాంతీయం

నేషనల్ హెల్త్ మిషన్  ఉద్యోగులు సమాన పనికి సమాన వేతనం నినాదంతో గత మూడు రోజులుగా ధర్నా కార్యక్రమం

5 Views

తెలుగు న్యూస్ మంచిర్యాల:

ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు  నేషనల్ హెల్త్ మిషన్  ఉద్యోగులు సమాన పనికి సమాన వేతనం నినాదంతో గత మూడు రోజులుగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్  ఆధ్వర్యంలో ధర్నా స్థలానికి వెళ్లి వారికి మద్దతు తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం, గరిష్ట వేతనంతో వారు ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని, భారతదేశంలో ఉన్న బిజెపి పాలిత ప్రాంతాలైన మహారాష్ట్ర అరుణాచల్ ప్రదేశ్, హర్యానా రాజస్థాన్ పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో NHM ఉద్యోగులకి సమాన పని సమాన వేతనం ఇస్తూ వారి ఉద్యోగాలు పర్మినెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో వీరి డిమాండ్లను స్వీకరిస్తూ వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేనిపక్షంలో వీరి తరపున ఉండి పోరాడటానికి పార్టీ జెండా పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మంచిర్యాల కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ముఖేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు కమలాకర్ రావు, పట్టి వెంకటకృష్ణ, జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్, నస్పూర్ జోన్ అధ్యక్షులు కుర్ర చక్రవర్తి నాయకులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *