ప్రాంతీయం

రూ.29.15 కోట్ల బకాయిపై ఆర్‌ఆర్‌ చట్టం కింద చర్యలు. 15 రోజుల్లో చెల్లించకుంటే ఆస్తుల జప్తు, వేలం. రాయపోల్ తహసిల్దార్ కృష్ణమోహన్.

4 Views

రాయపోల్‌ మండలం వడ్డేపల్లి గ్రామంలోని ఎంఎస్‌ శ్రీ సాయి వీరభద్ర రైస్‌ ఇండస్ట్రీస్‌ యాజమాన్యం ప్రభుత్వ ధాన్యం నిల్వలను దుర్వినియోగం చేయడంతో రూ.29,15,49,811 నష్టం వాటిల్లిందని రాయపోల్ తహసీల్దార్‌ కృష్ణమోహన్‌ తెలిపారు. ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సెప్టెంబర్‌ 29న తహసీల్దార్‌ కార్యాలయం నుంచి యాజమాన్యానికి నోటీసు జారీ చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.29.15 కోట్లను 15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు. గడువులోగా బకాయి చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ చట్టం–1864లోని సెక్షన్‌ 5 ప్రకారం సంస్థకు చెందిన చర, స్థిరాస్తులను జప్తు చేసి ప్రభుత్వ బకాయిలను వసూలు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ నివేదికలు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు తహసీల్దార్‌ తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *