ప్రాంతీయం

గ్రామస్థాయిలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాల దుర్గ ప్రసాద్.

9 Views

గ్రామస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రజలకు అందేలా కార్యకర్తలు కృషి చేయాలని మండల అధ్యక్షులు జాల దుర్గాప్రసాద్‌ అన్నారు. మంగళవారం మంతూర్‌, అనాజీపూర్‌, కొత్తపల్లి గ్రామాల్లో ఏఎంసీ చైర్మన్‌ గొల్లపల్లి కనకయ్యతో కలిసి గ్రామ కాంగ్రెస్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ గ్రామ కమిటీల ద్వారా పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడంతో పాటు ప్రజా సమస్యలను పార్టీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు కమిటీల్లో ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు. అనాజీపూర్‌ గ్రామ అధ్యక్షుడిగా రాచకొండ యాదగిరి, మంతూర్‌ గ్రామ అధ్యక్షుడిగా కాశ చందు, కొత్తపల్లి గ్రామ అధ్యక్షుడిగా ఎల్లం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పాల రామాగౌడ్‌, ఉషనగల్ల స్వామి, ప్రధాన కార్యదర్శి పాపని నరేష్‌, మాజీ మండల అధ్యక్షులు తప్పటి సుధాకర్‌, ఉప సర్పంచ్‌ రాజు, ఏఎంసీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *