*రామగుండం పోలీస్ కమిషనరేట్*
*బాధితుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*
తెలుగు న్యూస్:
ప్రజలు, బాధితులు తమ సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించుకునేందుకు పోలీసులను ఆశ్రయించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులపై సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, చట్టపరమైన నిబంధనల మేరకు సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.





