ప్రాంతీయం

వినాయక నిమర్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

7 Views

వినాయక నిమర్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల ,సెప్టెంబర్ 23, 2026:
వినాయక నవరాత్రుల అనంతరం నిర్వహించే నిమర్జన కార్యక్రమాన్ని సామరస్యంతో, ప్రశాంత వాతావరణంలో సజావుగా జరుపుకోవాలని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని దండేపల్లి మండలం గూడెంలో నిమజ్జన ప్రాంతాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్, ఎస్ ఐ లతో కలిసి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, నిమజ్జన ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని తెలిపారు. మండలంలోని ద్వారక గ్రామంలో కొనసాగుతున్న షెడ్యూల్డ్ తెగల బాలుర సంక్షేమ వసతి గృహం పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి తరగతి గదులు, రిజిస్టర్లు, విద్యా బోధన, పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని తెలిపారు. 9వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాసన సామర్ధ్యాలను పరీక్షించారు. మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే, మండల పరిషత్ అభివృద్ధి అధికారి లతో కలిసి సందర్శించి భోజనశాల, అదనపు గదులు, వంటశాల, సామాగ్రి నిల్వ గది, వసతి సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఆహారం తయారీ సమయంలో శుభ్రత నిబంధనలు పాటించాలని, తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని సిబ్బందికి సూచించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని తెలిపారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చే విధంగా ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ క్రమంలో మ్యాపింగ్ కాని, అనమలిస్ జాబితాలో ఉన్న ఓటర్లకు అందించిన నోటీసులకు సంబంధించి ఓటర్లు సమర్పిస్తున్న ధ్రువపత్రాలను పరిశీలన పారదర్శకంగా, వేగవంతంగా చేపట్టాలని, అర్హత గల ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి కల్పిస్తున్న సదుపాయాల వివరాలను తెలుసుకున్నారు. గర్భిణులు సమయానుసారంగా అవసరమైన పరీక్షలు చేసుకొని సకాలంలో పౌష్టిక ఆహారం, మందులు తీసుకోవాలని, ప్రసవం ఆసుపత్రిలోని చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. పిల్లలకు అందించవలసిన టీకాలను సకాలంలో అందించాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *