రాయపోల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా జెడ్పీహెచ్ఎస్ రాయపోల్ విద్యార్థులు పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని వివిధ విభాగాలు, వాటి విధుల గురించి సిబ్బంది విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా రాయపోల్ ఎస్ఐ లింగం మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదుదారులు వచ్చినప్పుడు అనుసరించే విధానాలు, పోలీస్ స్టేషన్లోని వివిధ విభాగాల పనితీరు గురించి వివరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను, సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. రిసెప్షన్, రైటర్, సీసీటీఎన్ఎస్ తదితర విభాగాల పనితీరును సిబ్బంది దేవయ్య, సనా, మల్లేష్ విద్యార్థులకు వివరించారు.





