ప్రాంతీయం

పెద్దవాగు వద్ద గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన కాలేశ్వరం జోన్-I డీఐజీ అంబర్ కిషోర్ ఝా

5 Views

*కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా*

*పెద్దవాగు వద్ద గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన కాలేశ్వరం జోన్-I డీఐజీ అంబర్ కిషోర్ ఝా*

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్ సబ్ డివిజన్ పరిధిలోని పెద్దవాగు ప్రాంతంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను కాలేశ్వరం జోన్-I డీఐజీ అంబర్ కిషోర్ ఝా,ఆసిఫాబాద్ ఎస్పీ నికితా పంత్, పోలీసు,మున్సిపల్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
పెద్దవాగు వద్ద గణేష్ నిమజ్జనం నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది,బందోబస్తు ఏర్పాట్లు,మంచినీటి వసతి,గజఈతగాళ్ల ఏర్పాటు,విద్యుత్ దీపాల సౌకర్యం తదితర ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కాగజ్‌నగర్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి రానున్నందున ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నిమజ్జనానికి వచ్చే వాహనాల రాకపోకల మార్గాలను పరిశీలించి, అవసరమైన ప్రాంతాల్లో చేపట్టాల్సిన ట్రాఫిక్ మళ్లింపులపై అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లను పూర్తి చేయాలని,ఈసారి మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని డీఐజీ పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ డీఎస్పీ, కాగజ్‌నగర్ టౌన్ సీఐ,కాగజ్‌నగర్ రూరల్ సీఐ, మున్సిపల్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *